PDPL: రామగుండం పరిధిలో ఇటీవల నిర్వహించిన డ్రంక్ డ్రైవ్లో పట్టుబడిన ఏడుగురిని గోదావరిఖని కోర్టులో శుక్రవారం హాజరు పరిచినట్లు ట్రాఫిక్ CI రాజేశ్వరరావు తెలిపారు. ఇందులో ఆరుగురికి రూ.12 వేల జరిమానా విధించగా రెండోసారి పట్టుబడిన ఒకరికి 3 రోజుల జైలుశిక్ష విధిస్తూ జడ్జి వెంకటేష్ దుర్వా తీర్పునిచ్చినట్లు CI తెలిపారు. శిక్షపడిన వ్యక్తిని కరీంనగర్ జైలుకు తరలించామన్నారు.