ప్రకాశం: ఉమ్మడి ప్రకాశం జిల్లాలో నిన్న కురిసిన అకాల వర్షాలకు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పిడుగులు పడి దర్శి (M) చామంతి పూడిలో మల్లికార్జున, ముండ్లమూరు (M) వేముల బండలో శివకృష్ణ, కనిగిరిలో దుర్గేష్ కుమార్, పుల్లలచెరువు (M)లో కన్నయ్య, నాగయ్య అనే వ్యక్తులు మృతి చెందారు. వీటి ధాటికి మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, ఈ వర్షాల కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.