సత్యసాయి: హిందూపురానికి చెందిన ఫైనాన్స్ నిర్వాహకుడు మణికి చెక్ బౌన్స్ కేసులో 6 నెలల జైలు శిక్ష పడింది. సరోజాబాయి, పవిత్ర నుంచి రూ. 5లక్షల రుణం తీసుకున్నాడు. ఆయన చెక్కు రూపంలో చెల్లించాడు. చెక్కు చెల్లకపోవడంతో బాధితులు కోర్టును ఆశ్రయించగా, న్యాయాధికారి రమణయ్య శిక్షతో పాటు 5 లక్షల జరిమానా విధించారు. అనంతరం ఉన్నత న్యాయస్థానంలో అప్పీలు చేసుకునేందుకు వీలుగా బెయిల్ మంజూరు చేశారు.