కృష్ణా: ఏపీ రాజధాని అమరావతిని పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో కంకిపాడు మండలం టీడీపీ కార్యాలయంలో నుంచి బస్టాండ్ వరకు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ శాశ్వత రాజధానిగా అమరావతిని కేంద్రం పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించడం ప్రతి తెలుగు వాడి హర్షించదగ్గ విషయమని అన్నారు.