VKB: వికారాబాద్ పట్టణంలోని ఎన్నేపల్లిలో నూతనంగా నిర్మించిన వీరశైవ బసవ భవనాన్ని శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజ సేవకు ఈ భవనం వేదిక కావాలని ఆకాంక్షించారు. లింగాయత్ సంఘం నాయకులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.