MHBD: తొర్రూరు మండలంలోని చర్లపాలెం ఉప సర్పంచ్ జినుగా రవీందర్ రెడ్డి సహకారంతో కొనుగోలు చేసిన చేతి కర్రలను తొర్రూరు ఎస్సై ఉపేందర్ చేతుల మీదుగా ధర్మారపు సాయిలు అనే వికలాంగ వృద్ధుడికి అందజేశారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ.. నడవలేని స్థితిలో ఉన్న వృద్ధుడికి సొంత ఖర్చులతో చేతి కర్రలు అందించడం అభినందనీయమని కొనియాడారు.