TG: రాష్ట్రవ్యాప్తంగా మీ-సేవా కేంద్రాలు తాత్కాలికంగా మూతపడనున్నాయి. మీ- సేవా పోర్టల్లో కొత్త సాఫ్ట్వేర్ వెర్షన్ను అప్లోడ్ చేయడం, డేటా సెంటర్ల వార్షిక నిర్వాహణ పనుల కారణంగా ఈ అంతరాయం ఏర్పడనుంది. ఇవాళ రాత్రి నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు బంద్ కానున్నాయి. ఈ విరామ సమయంలో కుల, ఆదాయ, భూమి రికార్డులు, విద్యుత్ బిల్లుల చెల్లింపులు సాధ్యపడవు.