హీరోయిన్ మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఒంటరితనం వల్ల తాను ఎంతో బాధ పడ్డానని తెలిపింది. గత నెల తనకెన్నో అనుభూతులు అందించినట్లు పేర్కొంది. ముఖ్యంగా త్యాగరాజన్ కుమారరాజ దర్శకత్వంలో ‘పాకెట్ నవల్’ కోసం పని చేయడం అద్భుతమైన అనుభవం అని చెప్పింది. అలాగే, ఇంటికి అంతకాలం దూరంగా ఉండటం ఎక్కువగా కుంగదీసిందని చెప్పుకొచ్చింది.