ADB: బజరహత్నూర్ మండలంలోని జాతర్ల గ్రామంలో కలెక్టర్ రాజర్షి షా శుక్రవారం పర్యటించారు. జిల్లా కలెక్టర్ ప్రత్యేక చొరవతో మంజూరు చేసిన ఊయీకె సుభద్ర నూతనంగా నిర్మించుకున్న ఇంటిని ఆయన సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఆమెను శాలువాతో సన్మానించి బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రాజేశ్వర్, MPDO శ్రీనివాస్, MRO శ్యామ్ సుందర్, తదితరులు పాల్గొన్నారు.