VSP: సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహ స్వామి వార్షిక కళ్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం నిర్వహించిన ‘అంగుళీయక అన్వేషణ’ ఘట్టం భక్తులను ఆకట్టుకుంది. ఉంగరం కోసం స్వామివారు మహారాజా అలంకారంలో వీధుల్లోకి రావడం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. చివరికి ఉంగరం స్వామివారి పట్టు పీతాంబరాల్లోనే లభించడంతో భక్తులు హర్షం వ్యక్తం చేశారు.