SDPT: బెజ్జంకి మండలం వడ్లూర్ గ్రామంలో గ్రామ స్వరాజ్య సంస్థ ఆధ్వర్యంలో కుట్టు మిషన్ శిక్షణ కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు. సర్పంచ్ పులి రమేష్ గౌడ్ ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు ఈ శిక్షణ ఉపాధికి దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ మరియా, వార్డు సభ్యులు, NHR కమిటీ సభ్యులు పాల్గొన్నారు. సిద్దిపేట జిల్లా కోఆర్డినేటర్ స్వరూప శిక్షణ అందించారు.