SRD: మునిపల్లి మండలం నుండి సంజీవన్ రావు పేట్, సిర్గాపూర్ మీదుగా గౌడ్గామ్ వరకు రూ. 21 కోట్లతో చేపట్టనున్న రోడ్డు విస్తరణ పనులకు ఎమ్మెల్యే డాక్టర్ సంజీవరెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు రవాణా సౌకర్యం మరింత మెరుగుపడుతుందన్నారు. అలాగే ప్రయాణికులకు సమయం ఆదా అవుతుందని తెలిపారు.