AP: అమరావతిపై చంద్రబాబు గ్రాఫిక్స్ కథలు చెప్పారని వైసీపీ ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. రెండేళ్లలో రాజధానిని పూర్తి చేస్తామన్నారు.. ఇప్పడు నిరంతర ప్రక్రియ అంటున్నారని విమర్శించారు. చంద్రబాబు ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారని అన్నారు. పార్లమెంట్ భవనం చదరపు అడుగు ఖర్చు రూ.4 వేలు అని, అమరావతిలో మాత్రం చదరపు అడుగు ఖర్చు రూ.12 వేలు అని పేర్కొన్నారు.