ASR: డుంబ్రిగుడ మండలం అరకు సంతబయలులో క్రైస్తవులు ఘనంగా గుడ్ ఫ్రైడే నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసుక్రీస్తు సిలువ మరణాన్ని స్మరిస్తూ క్రైస్తవులు గ్రామంలో శాంతి ర్యాలీలు, సిలువ యాత్రను ఘనంగా నిర్వహించారు. సిలువ యాత్రను చర్చి నుండి ప్రారంభించి విషాద గీతాలు పాడుతూ, ఏసుక్రీస్తు త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ వీధుల్లో తిరిగారు.