HYD: ఒక చిన్నారి తన పొదుపు డబ్బులతో రూపొందించిన తెలంగాణ జాగృతి పార్టీ పోస్టర్లను కల్వకుంట్ల కవిత ఆవిష్కరించారు. ఆ పాప నిస్వార్థ చర్యలో ఉద్యమ ఆత్మ కనిపిస్తోందని ఆమె కొనియాడారు. ఏప్రిల్ 25 నుంచి తమ పార్టీ నూతన ప్రయాణం ప్రారంభమవుతుందని వెల్లడించారు. కొత్త కలలు కనే ప్రతి ఒక్కరి కోసం ఈ వేదిక పని చేస్తుందని కవిత పేర్కొన్నారు.