PPM: పెదమేరంగి జంక్షన్ పరిసరాల్లో ఏనుగులు సంచరిస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రిషికేష్ ఆధ్వర్యంలో సిబ్బంది పర్యవేక్షణ చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలకు ఎలిఫెంట్ ట్రాకర్లు సూచనలు చేస్తూ, ఏనుగులను ఎట్టి పరిస్థితుల్లోనూ కవ్వించవద్దని హెచ్చరించారు. రాత్రి సమయంలో జాగ్రత్తగా ఉండాలని, సమూహాలుగా కదలాలని సూచించారు.