WGL: నగరంలో చెరువుల పునరుద్ధరీకరణకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్లు రాష్ట్ర దేవాదాయ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా వరంగల్(తూర్పు)నియోజకవర్గ పరిధిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు.