MDK: పిల్లుట్ల గ్రామంలోని చెరువు తూము శిథిలావస్థకు చేరడంతో గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చెరువుకున్న రెండు తూముల్లో ఒకటి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉందని, అదే జరిగితే నీరు ఒక్కసారిగా బయటకు వచ్చి దిగువ ప్రాంతాలు మునిగిపోతాయని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి తూముకు మరమ్మతులు చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు.