ఏలూరు నగర పాలక సంస్థలో పని చేస్తున్న దాదాపు 1000 మంది మున్సిపల్ ఆప్కాస్ కార్మికులకు మార్చి నెల జీతాలు వెంటనే ఇవ్వాలని ఏ.పీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ కోరింది. ఈ మేరకు కమిషనర్‌కి వినతి అందించారు. 8వ తారీకు వచ్చిన కూడా జీతాలు రాకపోవడంతో కార్మికులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. జీతాలు విడుదల చేయాలని కోరారు.