KNR: శంకరపట్నం మండలం కేశవపట్నంలోని పలు ఎరువుల దుకాణాలను జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తనిఖీ చేశారు. అత్యంత విషపూరితమైన ‘పారాక్వాట్ డైక్లోరైడ్’ వాడకంపై ప్రభుత్వం 60 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధించిందని ఆమె తెలిపారు. ఈ మందు ప్రాణాపాయానికి దారితీస్తుందని, దీని నిల్వ, పంపిణీ, తయారీ లేదా అమ్మకాలు జరిపితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.