AP: తిరుపతిలోని పద్మావతినగర్‌లో కిడ్నాప్ కలకలం రేపింది. రసూల్‌ఖాన్ అనే వ్యక్తిని కడప గ్యాంగ్ కిడ్నాప్ చేశారు. నలుగురు వ్యక్తులు తిరుపతికి వచ్చి అపహరించారు. కడపకు చెందిన మనోహర్‌రెడ్డితో రసూల్‌ఖాన్‌కు ఆర్థిక లావాదేవీల వివాదం ఉంది. ఈ క్రమంలో పోలీసులకు కుటుంబసభ్యులు ఫిర్యాదు చేయడంతో 5 బృందాలతో గాలిస్తున్నారు.