AKP: తిమ్మరాజుపేటలో టీడీపీ నాయకులు చేపట్టిన బహిష్కరణపై మాజీ ఎంపీ పప్పల చలపతిరావు స్పందించారు. శుక్రవారం గ్రామానికి చేరుకుని కార్యకర్తలతో సమావేశమయ్యారు. బహిష్కరణను వెంటనే విరమించాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం కోసం ప్రతి ఒక్కరూ సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని పేర్కొన్నారు.