ATP: అనంతపురం రైల్వే స్టేషన్, బస్స్టాండ్, పార్సిల్ కార్యాలయంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. నార్కోటిక్స్ పసిగట్టడంలో శిక్షణ పొందిన ‘టైగర్’ జాగిలంతో అనుమానితుల లగేజీలను తనిఖీ చేశారు. గంజాయి, అక్రమ మద్యం రవాణాను అరికట్టడమే లక్ష్యంగా ఈ సోదాలు సాగాయి. మాదక ద్రవ్యాల సమాచారం ఉంటే 1972 లేదా 112 నంబర్లకు తెలియజేయాలని కోరారు.