బిచ్చగాడు’ వంటి భారీ హిట్ తర్వాత విజయ్ ఆంటోనీ, డైరెక్టర్ శశి కాంబినేషన్లో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘వంద దేవుళ్ళు’. ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రేపు విడుదల చేయనున్నట్లు హీరో స్వయంగా ప్రకటించాడు. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.