SKLM: ప్రజల సమస్యలు పరిష్కారానికే ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే శిరీష అన్నారు. పలాస టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే శుక్రవారం ప్రజా దర్బార్లో పాల్గొని ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. వివిధ ప్రాంతాల నుండి పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాలు సంబంధించిన 54 వినతులు స్వీకరించారు. సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులని ఆదేశించారు.