NGKL: సోమశిల నుంచి సంగమేశ్వరం వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా లైఫ్ జాకెట్లు ధరించాలని జిల్లా పర్యాటక అధికారి కల్వరాల నరసింహ ఆదేశించారు. శుక్రవారం సర్పంచ్‌తో కలిసి బోట్లను పరిశీలించిన ఆయన, జాకెట్లు లేని వారిని అనుమతించవద్దని నిర్వాహకులకు స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే బోట్ల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.