KNR: కరీంనగర్ రూరల్ మండల తహసీల్దార్‌గా బాధ్యతలు స్వీకరించిన లక్ష్మి నరసింహా రావు, శుక్రవారం కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా స్థానిక ప్రజల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేస్తానని తహసీల్దార్ తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.