కోనసీమ: మురమళ్ళ శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను దేవాదాయ శాఖ అధికారులు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డీఈ ఉదయ్ కుమార్, ఏసీ సత్యనారాయణ, ఛైర్మన్ దాట్ల రామకృష్ణంరాజు, ఆలయ అర్చకులు సీతారామ శర్మతో కలిసి పనులను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ఆలయ జీర్ణోద్ధరణ కార్యక్రమం ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు చొరవతో చేపడుతున్నామని తెలిపారు.