AP: కడప జిల్లాలో ఖాళీగా ఉన్న 171 అంగన్వాడీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. వయస్సు జూలై 1, 2026 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హత గల వారు ఆఫ్లైన్ విధానంలో ఈనెల13న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. ఈనెల 23న సంబంధిత RDO కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు.