KMM: పేదలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేయాలని అదనపు కలెక్టర్ శ్రీజ వైద్య సిబ్బందిని ఆదేశించారు. శనివారం ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించిన ఆమె, రోగులకు అందుతున్న వైద్య సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి రికార్డులను పరిశీలించి, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యం వహించకూడదని సూచించారు.