కామారెడ్డి ఏఎస్పీ కార్యాలయంలో ఆధునీకరించిన నూతన ఛాంబర్‌ను ఎస్పీ రాజేశ్ చంద్ర నేడు ప్రారంభించారు. ప్రజలకు, బాధితులకు మెరుగైన వాతావరణంలో సేవలందించే లక్ష్యంతో ఈ పునరుద్ధరణ చేపట్టినట్లు ఎస్పీ తెలిపారు. మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పారదర్శకత, పనివేగం పెరుగుతాయని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ చైతన్య రెడ్డి, అదనపు ఎస్పీ నరసింహ రెడ్డి, సీఐలు ఉన్నారు.