MNCL: మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ భీమారం కేజీబీవీని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, వసతులను పరిశీలించి విద్యార్థుల సౌకర్యాలపై ఆరా తీశారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఆరుగురు సిబ్బందికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విద్యార్థులకు నాణ్యమైన భోజనం, మెరుగైన వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు.