AKP: ఎలమంచిలి మండలం రుక్మిణిపురంలో గురువారం ఉపాధిహామీ పనులు పునః ప్రారంభించారు. కార్యాచరణ ప్రణాళిక రూపొందించి గ్రామాల్లో ఉపాధి పనులు చేపడుతున్నట్లు జనసేన నాయకులు తెలిపారు. కొత్తగా అమలులోకి వస్తున్న వీబీ జీ రామ్ జీ పథకం ద్వారా కూలీలకు 125 రోజులు పని దినాలు కనిపించడం జరుగుతుందన్నారు. ఈ పథకం కూలీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.