TG: రంగారెడ్డి జిల్లా ఆమనగల్ మండలం మిఠాయిపల్లిలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ పర్యటించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ భూభారతి పోర్టల్‌ను ఆవిష్కరించారు. ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే ప్రజాప్రభుత్వం ఇది అని తెలిపారు. ఈ నెలాఖరులో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక జరుగుతుందని వెల్లడించారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేసి చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు.