BDK: కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ఇసుక మాఫియాపై కఠిన చర్యలు కొనసాగుతున్నాయి. మణుగూరు మండలంలో ఎమ్మార్వో ఉక్కు పాదం మోపుతూ అక్రమ ఇసుక రవాణాపై దాడులు నిర్వహిస్తున్నారు. ఎవరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు లేదా రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మార్వో హెచ్చరించారు. ప్రజలు ఇలాంటి అక్రమాలను గమనించిన వెంటనే సమాచారం అందించాలని కోరారు.