HYD: ఉప్పల్లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఏప్రిల్ 5న జరగనున్న IPL మ్యాచ్ సందర్భంగా భద్రత, ట్రాఫిక్, పార్కింగ్ ఏర్పాట్లపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. IPS సుధీర్ బాబు స్టేడియాన్ని సందర్శించి అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.