GDWL: గట్టు మండలంలో ఇసుక మాఫీయాపై పోలీసులు పంజా విసిరారు. బలిగేర గ్రామం నుంచి చింతలకుంట, కేటీ దొడ్డి గ్రామాలకు ఎటువంటి అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్‌ను శుక్రవారం పోలీసులు పట్టుకున్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న డ్రైవర్ హన్మంతు, యజమాని రమేష్‌లపై కేసు నమోదు చేసినట్లు కేటీ దొడ్డి ఎస్సై పగడాల శ్రీనివాసులు తెలిపారు.