ఆది సాయికుమార్ హీరోగా, ఫణికృష్ణ సిరికి దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ ‘హాస్య మూవీస్’ బ్యానర్‌పై నిర్మించనుంది. తాజాగా మేకర్స్ ఈ చిత్ర టైటిల్‌ను లాంచ్ చేశారు. ఈ సినిమాకు ‘సైరా భాను’ అనే టైటిల్‌ను ఖరారు చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీతో బాంధవి శ్రీధర్ హీరోయిన్గా వెండితెరకు పరిచయం కాబోతోంది.