GDWL: గట్టు మండల కేంద్రంలో 7వ వార్డు సభ్యురాలు రోల్లి రేణమ్మ భర్త రోల్లి కృష్ణ తనపై దాడి చేశాడని తిమ్మప్ప అనే వ్యక్తి శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎన్నికల సమయంలో సీసీ రోడ్డు, పైప్లైన్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చి, గెలిచిన తర్వాత ఆ పనుల గురించి ప్రశ్నించినందుకు తనపై భౌతిక దాడికి పాల్పడ్డారని బాధితుడు వాపోయాడు. ఈ మేరకు స్టేషన్లో ఫిర్యాదు చేశారు.