ASF: కాగజ్ నగర్ మండలం పెద్దవాగు మైసమ్మ గుడి వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం సంభవించింది. రెండు లారీలు ఎదురెదురుగా బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో లారీల్లో ఉన్న పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ధాటికి లారీల ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.