NRML: దిలావర్పూర్ మండల కేంద్రంలోని న్యూలోలం గ్రామంలో శుక్రవారం ఎస్సై రవీందర్ ఆధ్వర్యంలో గంజాయి నిషేధంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంజాయి వాడకం వల్ల దుష్పరిమానాలను వివరించారు. ఎవరైనా అక్రమంగా గంజాయి రవాణా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గంజాయి నిషేధానికి ప్రతి ఒక్కరు సహకరించాలని వారు కోరారు.