AP: ఒంగోలు కిమ్స్ ఆసుపత్రి వద్ద ఎన్‌హెచ్‌పై ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదంతో గంజాయి అక్రమ రవాణా బయటపడింది. తమిళనాడుకు గంజాయి తరలిస్తుండగా మార్గమధ్యలో ఇలా జరిగింది. దాణా బస్తాల లోడ్ కింద భారీ ఎత్తున గంజాయి తరలిస్తున్నారు. సుమారు 500 కిలోలు ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే లారీని వదిలేసి డ్రైవర్ పరారయ్యాడు.