SRD: జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరైన విద్యార్థుల వ్యక్తిగత వివరాల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు మరో అవకాశం కల్పించినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డేటా సవరణ గడువును ఈనెల 9వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.