అన్నమయ్య: ఈ నెల 15న ఒంగోలు పట్టణంలో నిర్వహించనున్న APPTD (RTC) ఎంప్లాయీస్ యూనియన్ 28వ రాష్ట్ర మహాసభలకు రాష్ట్ర రవాణా, యువజన & క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారిని యూనియన్ రాష్ట్ర నాయకులు ఆహ్వానించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఉద్యోగుల భాగస్వామ్యంతో మహాసభలను విజయవంతంగా నిర్వహించేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.