టాలీవుడ్ ప్రముఖ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ఆయన కుమార్తె జానకి వివాహం నిశ్చయమైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో కాబోయే వధూవరుల ఫొటోలు వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోతున్న ఈ జంటను చూసి నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. ఈ వివాహానికి సంబంధించిన వివరాలు త్వరలోనే బండ్ల గణేష్ అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.