ASR: చింతూరు ఎస్సైగా ఎం.సంతోష్ కుమార్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. పోలీస్టేషన్ సిబ్బంది ఆయనకు ఆహ్వానం పలికి అభినందనలు తెలిపారు. ఆయన బదిలీపై వీఆర్పురం నుంచి ఇక్కడకు వచ్చారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తానని, అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తామని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఇక్కడ ఎస్సైగా పని చేసిన రమేష్ రంపచోడవరానికి బదిలీ అయ్యారు.