NTR: పేదల బియ్యాన్ని పక్కదారి పట్టిస్తున్న అక్రమార్కుల గుండెల్లో ఇబ్రహీంపట్నం ఎస్సై సత్యవతి వణుకు పుట్టించారు. పక్కా సమాచారంతో గుంటుపల్లిలో మెరుపు దాడులు నిర్వహించి భారీ ఎత్తున రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాచిన సుమారు 1.75 టన్నుల రేషన్ బియ్యాన్ని గుర్తించి వెంటనే సీజ్ చేశారు.