KMR: తెలంగాణ జాగృతి ఎల్లారెడ్డి మండల అధ్యక్షుడిగా గాంధీని నియమించారు. రాష్ట్ర అధ్యక్షురాలు కవిత ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన HYDలో కవితను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మండలంలో సంస్థను బలోపేతం చేయాలని కవిత సూచించారు. రాబోయే రోజుల్లో కవిత నాయకత్వంలో ప్రజలకు మేలుజరుగుతుందని గాంధీ ఆశాభావం వ్యక్తం చేశారు.