SRPT: సూర్యాపేట-ఖమ్మం హైవేపై చందుపట్ల వద్ద అర్ధరాత్రి రసాయన వ్యర్థాలను రోడ్డు పక్కన పారబోస్తున్న కంపెనీ వాహనాన్ని, కుంచం మధు అనే యువకుడు అడ్డుకున్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో వారు వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. కాలుష్య కారక సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు. మధు ధైర్య సాహసాలను స్థానికులు కొనియాడారు.