JGL: మల్యాల మండలం నూకపెల్లికి చెందిన అబ్దుల్ వాహేద్ (32) రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. జగిత్యాల నుంచి ఆటోలో వస్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన ఆయన చికిత్స పొందుతూ మరణించారని ఎస్ఐ నరేశ్ తెలిపారు. మృతుడి అన్న ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.